లిస్టుల రాజకీయం పై క్షేత్రస్థాయి జర్నలిస్టుల ఆవేదన
పయనించే సూర్యుడు ఆగస్టు 17(సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు )తిరుపతి జిల్లాసూళ్లూరుపేట మండలం లో కొందరు విలేకరుల వ్యవహారశైలిపై క్షేత్రస్థాయి పాత్రికేయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సూళ్లూరుపేట జర్నలిస్టులు ఒక ప్రత్యేక జాబితా ఆధారంగా విభజిస్తూ, స్థానికంగా అక్రమ గ్రావెల్ , మట్టి ,మాఫియాకు అండగా ఉంటూ అక్రమాలు చేసిన వారిపై ఎటువంటి వార్తలు రాయకుండా ఒక ప్రత్యేక విలేకరుల లిస్టు టీంని రూపొందించారు? ఈ టీం ఏర్పాటుచేసిన ఎవరు ఆ సుధామయుడు? ,విలేకరులు స్థానికంగా విలేకరుల లిస్టు తయారుచేసి ఈ అక్రమ గ్రావిల్ నడిపే వారి దగ్గరకు మేము ఈ లిస్టులో ఉండేవారికి ముడుపులు అందిస్తాము అని చెప్పి వారి దగ్గర నుండి తీసుకొని వారి డైరీలో వ్రాసుకున్న ఉన్న పేర్లు వారిగా వారి భాగం వారికి చేరవేస్తున్న డెలివరీ బాయ్ సుధాలోనుడు ఎవరు ?ఇది స్థానికంగా ఉన్న క్షేత్రస్థాయి నిజాయితీ విలేకరులకు బాధాకరంగా మారింది ఈ విషయంపై స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్వహించే సమావేశాలు, కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం విషయంలో కొందరు విలేకరులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఆ జాబితాలో లేని క్షేత్రస్థాయి విలేకరులకు సమాచారం అందకుండా చేయడం, వారిని చిన్నచూపు చూడడం పట్ల పలువురు పాత్రికేయులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆ జాబితాను ఒక విలేఖరు రూపొందించారు? ఎవరా సుధామయుడు అధికార పార్టీకి కొందరు విలేకరుల మధ్య అనుసంధానంగా మారిన ఆ సుయోధనుడు ఎవరు ?అనే ప్రశ్నలకు స్పష్టత ఇవ్వాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వం జారీ చేసే అక్రిడిటేషన్ ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం కల్పించే అధికారిక గుర్తింపు, సౌకర్యం మాత్రమే. దానిని జర్నలిజంలో పనిచేస్తున్న వ్యక్తి వృత్తిపరమైన సామర్థ్యానికి ఏకైక ప్రమాణంగా చూడటం సరికాదని క్షేత్రస్థాయి విలేకరులు అంటున్నారు. ప్రతిరోజూ ప్రజల మధ్యకు వెళ్లి సమస్యలను వెలుగులోకి తీసుకురావడం, అధికారుల దృష్టికి ప్రజా సమస్యలను తీసుకెళ్లడం, వాస్తవాలను సేకరించి వార్తలుగా అందించడం వంటి బాధ్యతలను నిర్వర్తించే ప్రతి పాత్రికేయుడికి సమాజంలో ఉన్న నైతిక విలువలు కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు వార్తా సేకరణలో నిబద్ధత, వాస్తవాలపై అవగాహన, ప్రజా సమస్యల పట్ల బాధ్యత, నిజాలను నిర్భయంగా వెలుగులోకి తీసుకురావడం జర్నలిస్టు వృత్తికి అసలు బలం. కేవలం ఒక గుర్తింపు కార్డు ఉందా? లేదా? అనే అంశంతో ఒకరి పాత్రికేయతను నిర్ణయించడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అక్రిడేషన్ ఉన్నవారిని గౌరవించడంతో పాటు, అక్రిడేషన్ లేకపోయినా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టుల హక్కులను, వృత్తిపరమైన గౌరవాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పలువురు పేర్కొంటున్నారు. పాత్రికేయ రంగంలోనే ‘ఈ లిస్టులో ఉన్నవారు’, అంటూ విభజనలు సృష్టించడం వృత్తిపరమైన ఐక్యతకు విఘాతం కలిగిస్తుందని స్థానిక విలేకరులు అంటున్నారు. జర్నలిస్టుల మధ్య అనవసరమైన భేదాలు సృష్టించడం .ఎవరో రూపొందించిన అనధికారిక జాబితాలను ఆధారంగా చేసుకుని విలేకరుల మధ్య తారతమ్యం చూపకూడదని వారు కోరుతున్నారు. పాత్రికేయుల మధ్య విభేదాలకు దారితీసే అనధికారిక జాబితాలకు బదులుగా పారదర్శకమైన విధానం అవలంబించాలని కోరుతున్నారు. జర్నలిజం అంటే గుర్తింపు కార్డు కాదు….ప్రజల కోసం నిలబడే బాధ్యత. విలేకరుల మధ్య విభజనలు సృష్టించడం కంటే వృత్తిపరమైన ఐక్యతను కాపాడటం, ప్రజా సమస్యలను, సమాజంలో జరిగే అక్రమాలను వెలుగులోకి తీసుకురావడమే పాత్రికేయ రంగానికి గౌరవాన్ని తీసుకొస్తుందని పలువురు రాజకీయ ప్రతినిధులు సీనియర్ పాత్రికేయులు ప్రజా సంఘాలు అభిప్రాయపడుతున్నారు.