PS Telugu News
Epaper

వసతి గృహ నిర్మాణమునకు ఒక లక్ష విరాళం: ఆలయ ఈవో యం. రామక్రిష్ణ.

📅 30 Dec 2025 ⏱️ 7:26 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు డిసెంబర్ 30,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న

ప్రముఖ శైవక్షేత్రం పాణ్యం మండలం ఎస్.కొత్తూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం నందు భక్తుల సౌకర్యార్థం నిర్మాణము గావించబడుతున్న వసతి గృహము నిర్మాణము నిమిత్తము భక్తులు 1 లక్ష 1116/ లు సోమవారం విరాళంగా సమర్పించినట్లు ఆలయ ఈవో యం. రామకృష్ణ తెలిపారు. కర్నూలు పట్టణంలో చెందిన పంచాగ్నుల మల్లికార్జున శాస్త్రి జ్ఞాపకార్థం కుమారుడు పి.రమేష్ భరద్వాజ్ అనే భక్తుడు వారికి స్వామివారు ఇంటి ఇలవేల్పు కావడంతో మొక్కుబడిగా రూ.1,01,116/ లు ఒక లక్ష ఓక వెయ్యి నూట పదహారు రూపాయలు విరాళంగా సమర్పించారని, వారికి ఆలయ మర్యాదలతో అభిషేకములు, అర్చనలు, విశేష పూజలు నిర్వహించి శేష వస్త్రములతో సత్కరించి, స్వామివారి ప్రతిమ, ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు సురేష్ శర్మ, గ్రామ పెద్దలు మిలిటరీ సుబ్బారెడ్డి, దాత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top