శ్రవణా నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు

August 26, 2026 | సినిమా వార్తలు

పయనించే సూర్యుడు ఆగస్టు 26 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ)కాట్రేనికోన( మండలం ) గ్రామంలోఈరోజు శ్రవణా నక్షత్రం సందర్భంగా శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి వారికి దేవస్థానం ప్రధాన అర్చకులు ఆణి విళ్ళ ఫణి కాంత్ శాస్త్రి ఆధ్వర్యంలో అభిషేకం మరియు అష్టోత్తర నామాలతో పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఉదయం నుండే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. వేద మంత్రాల నడుమ జరిగిన అభిషేకంలో పాలు, పంచామృతాలతో స్వామివారికి ప్రత్యేక అలంకారాలు చేశారు. అష్టోత్తర శతనామార్చన అనంతరం భక్తులకు గోత్రనామాలతో అర్చనలు నిర్వహించి ఆశీస్సులు అందించారు.. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ప్రసాద వితరణ కూడా చేపట్టారు. భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

🌐 Select Language:
📰 ePaper