శ్రీ సత్తమ్మ తల్లి ఆశీస్సులతో చెయ్యరు గున్నేపల్లి గ్రామంలో మహాత్తర ఘాట్టం ఆవిష్కరణ..

June 9, 2026 | ఆంధ్రప్రదేశ్

పయనించే సూర్యుడు జూన్ 9 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి శ్రీ సత్తెమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యుల సహకారం తో గ్రామ విద్యార్థిని విద్యార్థులకు అమ్మవారి ఆర్థిక సహాయం శ్రీ సత్తెమ్మ తల్లి ఆలయ కమిటీ మరియు గ్రామస్తుల సహకారంతో సిహెచ్ గున్నేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల10వ తరగతి పాస్ అయిన18మంది విద్యార్థులకి కార్పొరేట్ విద్యను అమ్మవారి పేరుతో అందించారు. విద్యార్థులందరిని బీవీసీ అక్షర్ జూనియర్ కాలేజ్ చైర్మన్ ముఖ్య అతిధి శాసనసభ్యులు శ్రీ దాట్ల బుచ్చిబాబు చేతులమీదుగా అడ్మిషన్స్ ఇచ్చారు. వీరికి ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందచేస్తామని ఎమ్మెల్యే అన్నారు .ఇంత మంచి కార్యక్రమం చేసిన ఆలయ కమిటీ, గ్రామస్తులుని అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమం లో అతిధి గా పాల్గొన్న బీవీసీ చైర్మన్ బోనం కృష్ణ సతీష్ మాట్లాడుతు సమాజానికి ఉపయోగపడే ఇటువంటి కార్యక్రమం చేసినందుకు అభినందనలు తెలిపారు . ఈ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి ఉన్నతమైన భవిష్యత్ అందిచడానికి తన తోడ్పాటు అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమానికి అధ్యక్షతన వహించిన గొలకోటి దొరబాబు మాట్లాడుతూ విద్య ద్వారా సమాజం లో మార్పు సాధించవచ్చని గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులుకి ఇటువంటి అవకాశం కల్పించిన దాతలకు, బీవీసీ యజమాయానికి కృతజ్ఞతలు తెలిపారు .ఈ కార్యక్రమం లో స్కూల్ కమిటీ చైర్మన్ భోగి శెట్టి శ్రీనివాసరావు, ముమ్మిడివరం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గొలకోటి వెంకటరెడ్డి ఎంపీటీసీ గొల కోటి హనుమ రాజబాబు గాలిదేవర బుల్లి, యాళ్ల ఉదయ్, గొలకోటి భాస్కర రామూర్తి, సత్తెమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులు స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా గొల కోటి నారాయణరావు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper