షాద్ నగర్ లో ఎస్ఎఫ్ఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
షాద్ నగర్ డివిజన్ కేంద్రంలో ఎస్ఎఫ్ఐ 56 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు వడ్ల శ్రీకాంత్
( పయనించే సూర్యుడు డిసెంబర్ 31 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
ఎస్ఎస్ఐ షాద్ నగర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ ఆవిర్భావ సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి అనంతరం ఎస్ఎఫ్ఐ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు వడ్ల శ్రీకాంత్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ… 1970లో కేరళలోని త్రివేండ్రం లో ఎస్ఎఫ్ఐ స్వాతంత్రం ప్రజాస్వామ్యం, సోషలిజం లక్ష్యాలతో ఏర్పడిందని అధ్యయనం, పోరాటం నినాదంతో ముందుకెళ్తుందని అన్నారు. చదువుతూ పోరాడు.. చదువుకై పోరాడు అనే నినాదంతో ఎస్ఎఫ్ఐ విద్యా రంగ, విద్యార్థి సమస్యలపై పోరాటం చేస్తుందన్నారు. గత 56 సంవత్సరాల నుంచి విద్యార్థుల సమస్యలపై అనేక పోరాటాల నిర్వహిస్తూ దేశంలోని అతిపెద్ద విద్యార్థి సంఘంగా అవతరించిందని అన్నారు. ఎన్నికలు జరిగినా ఎస్ఎఫ్ఐ గెలవడం అందుకు నిదర్శనమని అన్నారు విద్యార్థుల సమస్యలపై స్కాలర్షిప్స్ ఫీజు నెంబర్స్మెంట్స్ ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఉ న్నటువంటి సమస్యలపై ఎస్ఎఫ్ఐ అనేక పోరాట నిర్వహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ,ఎస్ఎఫ్ఐ నాయకులు చరణ్, చింటూ,ఆఫ్సార్,సల్మాన్ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు…
