సీనియర్ జర్నలిస్టు పొట్టిపోతు నాగు జన్మదిన వేడుకలు – ఘన సన్మానం

July 26, 2026 | ఆంధ్రప్రదేశ్

పయ నించు సూర్యుడు జూలై 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ*అమలాపురం :* సీనియర్ జర్నలిస్టు మరియు 10 TV రిపోర్టర్ పొట్టిపోతు నాగు జన్మదినం సందర్భంగా ఆయనను పలువురు నాయకులు, జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు మోకా వెంకట సుబ్బారావు, బిజెవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గణిసెట్టి అరవింద్, జర్నలిస్ట్ యూనియన్ నాయకులు, సూర్య స్టాఫ్ రిపోర్టర్ రాంభాల నాగ వెంకట సత్యనారాయణ, 6TV రిపోర్టర్ ఎం.డి. బషీర్, సీనియర్ జర్నలిస్టు వాకపాల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.జన్మదిన వేడుకల సందర్భంగా పొట్టిపోతు నాగును శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన జర్నలిజం రంగంలో చేస్తున్న సేవలను అందరూ ప్రశంసించారు. సమాజంలో జరుగుతున్న అంశాలను ప్రజలకు నిజాయితీగా చేరవేస్తున్న జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో జరిగింది.

🌐 Select Language:
📰 ePaper