సొంత ఖర్చులతో ఆలయ పరిసరాలు పరిశుభ్రం
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి
బైంసా పట్టణంలో ని రోకడు హనుమాన్, బాలాజీ మందిర్ ఆవరణలో పరిసరాలను శుభ్రం చేయించారు. బుధవారం పట్టణానికి చెందిన బిజెపి నాయకులు కాసరోల్ల ప్రవీణ్ తన సొంత ఖర్చులతో పరిసర ప్రాంతాల్లో పెరిగిన పిచ్చిమొక్కలు తొలగించారు. అలాగే పరిసర ప్రాంతం చదును చేయించడం జరిగింది. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు ప్రవీణ్ ను అభినందించారు.