
పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 18(పయనించే సూర్యుడు న్యూస్ శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికిలోని స్టార్ ప్యారడైజ్ హైస్కూల్ లో శనివారం స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఐసిడిఎస్ సూపర్ వైజర్ విజయకుమారి బాలిక విద్య, పోషణ, ఆరోగ్యం, బాల్య వివాహల వలన అనర్థాలు, స్వచ్చ ఆంధ్ర,స్వర్ణ ఆంధ్ర తదితర అంశాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలిక విద్యతోనే సమాజంలో మార్పు తీసుకురావచ్చు అని తెలిపారు. బాలికలను ప్రతి ఒక్కరిని చదివించేలా తల్లిదండ్రులు కృషి చేయాలని తెలిపారు. పోషణ,ఆరోగ్యం పై అవగాహన కల్పించారు. బాల్య వివాహాల వలన కలిగే అనర్థాలను వివరించారు. స్వచ్ఛ ఆంధ్ర -స్వర్ణాంధ్ర లో భాగంగా విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో అంగన్ వాడీ వర్కర్లు మహాలక్ష్మి,శివ కుమారి, ఆది లక్ష్మి, పలువురు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
