
//పయనించే సూర్యుడు// న్యూస్// ఫిబ్రవరి12 మక్తల్ మక్తల్.స్థానిక పట్టణం లో శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయ ఆవరణలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 14 ని అమరవీరుల దినోత్సవంగా జరుపుకుందాం అను గోడ పత్రికను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు విశ్వహిందూ పరిషత్ ప్రఖండ అధ్యక్షులు కే. సత్యనారాయణ గౌడ్ పాలమూరు జిల్లా భజరంగ్ దళ్ సప్తయిక్ మిలన్ సంయోజక్ పి.భీమేష్* మాట్లాడుతూ ప్రేమికుల రోజు ను పాశ్చాత్య దేశాల విష సంస్కృతి విడనాడాలని సూచించారు. ఫిబ్రవరి 14 న పుల్వామా దాడిలో దేశం కోసం వీరమరణం పొందిన ఆర్మీ జవాన్లను స్మరించుకుని*, వారికి ప్రతి ఒక్కరూ నివాళలు అర్పించాలని వారు కోరారు. ఇట్టి కార్యక్రమంలో బజరంగ్ దళ్ ప్రఖండ సంయోజక్ రాహుల్. పట్టణ ప్రముఖ్ మూర్తి. పట్టణ సహ ప్రముఖ్ రామాంజనేయులు . గోరక్ష ప్రముఖ్ నాగరాజ్. గోరక్ష సహా ప్రముక్ అక్షయ్. నవీన్. అంజి. శివ.ఆనంద్. బజరంగ్ దళ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు