ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి భైంసా పట్టణంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి – ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పవార్ రామారావు పటేల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలకు చీరలను పంపిణీ చేసి, మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. మహిళా సాధికారతకు దోహదపడే సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం నిరంతరం కొనసాగిస్తోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు మరియు మహిళలు పాల్గొన్నారు.