మలేరియా నివారణకు ప్రత్యేక చర్యలు

June 1, 2026 | ఆంధ్రప్రదేశ్

పయ నించే సూర్యుడు జూన్ 1 ముమ్మిడివరం గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన గ్రామాల్లో మలేరియా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపట్టిన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ సబ్ యూనిట్ ఆఫీసర్ కొప్పిశెట్టి రామ మోహన్ రావు తెలిపారు,పల్లంకుర్రు ప్రాదమిక ఆరోగ్య కేంద్రంలో మలేరియా నివారణా మాసోత్సవాల సందర్భంగా డీఎంహెచ్‌వో దుర్గారావు దొర,జిల్లా మలేరియా నివారణ అధికారి కె ఎన్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత గా ఉంటే దోమల నిర్మూలనతో మలేరియా నివారణకు దోహద పడుతుందన్నారు,ప్రతి ఒక్కరూ డ్రైడే పాటించాలని,ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని సూచించారు.మలేరియా ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించామని వైద్యాధికారి పి.నీలిమా
తెలిపారు. గ్రామాల్లో జ్వర లక్షణాలున్నవారికి వెంటనే వైద్య పరీక్షలు చేయాలని సిబ్బందిని ఆదేశించామన్నారు.ఈ కార్యక్రమంలో క్రాంతి కుమార్,వైడూర్యం, నాగేంద్ర,శ్రీనివాస్, వెంకట్రావు,ఫణి కుమార్,సూరిబాబు,అనూరాధ,భారతి,
సుమిత్ర,ఆశ కార్యకర్తలు తదితరులున్నారు

🌐 Select Language:
📰 ePaper