అర్ధరాత్రి అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు.

June 2, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు మే 02 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ సత్తుపల్లి: ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్.సింగరేణి ప్రభావిత ప్రాంతాల ఉమ్మడి జిల్లా అధ్యక్షులు.బానోత్ నందు నాయక్. ఈరోజు సత్తుపల్లి నియోజవర్గం ఎన్టీఆర్ నగర్ కాలనీకి చెందిన. లంబాడీ హక్కుల పోరాట సమితి వర్కింగ్ ప్రెసిడెంట్.సింగరేణి ప్రభావిత ప్రాంతాల అధ్యక్షులు.బానోత్ నందు నాయక్ ను సత్తుపల్లి పోలీసులు అర్ధరాత్రి అక్రమ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. నందు నాయక్ మాట్లాడుతూ.అర్ధరాత్రి అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని చలో కొత్తగూడెం మహా ధర్నా ను ప్రభుత్వం పోలీసుల చేత అరెస్టు చేయటం బాధాకరమని అన్నారు.ఎన్ని అరెస్టులు చేసిన ఉద్యమాన్ని ఆపమని వారు ఈ ప్రభుత్వానికి హెచ్చరించారు.ఇప్పటికైనా ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు స్పందించి సత్తుపల్లి సింగరేణి ఎన్టీఆర్ కాలనీ బాంబ్ బ్లాస్టింగ్ వల్ల దెబ్బతిన్న ఇళ్లను సింగరేణి యాజమాన్యం పూర్తిగా కట్టించి ఇవ్వాలని వారు అన్నారు లేని వెడల దశల వారికి ఉద్యమం చేసి ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని వారు హెచ్చరించారు.

🌐 Select Language:
📰 ePaper