నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది.

June 2, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు 2 జూన్ 20 26 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ ; ఈ కార్యక్రమంలో నిజామాబాద్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నరేష్ రెడ్డి జిల్లా ప్రజలకు 13వ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఎంతోమంది ప్రాణ త్యాగాల ద్వారా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రము ఏర్పడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ పట్టుదలతోనే తెలంగాణ ఇవ్వడం జరిగిందని ఆనాడు ఆంధ్ర నాయకులు పార్లమెంట్లు ప్రత్యేక తెలంగాణ బిల్లుకు అడ్డుపడినప్పటికీ 1993 నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కొరకు అసురులు బాసిన ఎందరో అమరవీరులు త్యాగం మేరకు సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు.శుభాకాంక్షలు , రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డ నాయకత్వంలో మహేష్ కుమార్ గౌడ్ సారధ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుంది అని,జిల్లాలో పెద్దలు సుదర్శన్ రెడ్డి నాయకత్వంలో అభివృడి చేస్తామని నగేష్ రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎఎంసి చైర్మన్ ముప్పాగంగారెడ్డి, జిల్లా కాంగ్రెస్ కోశాధికారి భక్తవత్సలం, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కౌడపు శరత్ కుమార్, రత్నాకర్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ గౌడ్, మాజీ ఫ్లోర్ లీడర్ రాజేంద్రప్రసాద్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, బంటు బలరాం, కార్పొరేటర్ అన్వర్,ఎర్రం గంగాధర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మీసాల సుధాకర్ రావు, నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి, రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ సంఘం సాయిలు, జెండా గుడి చైర్మన్ లవంగ ప్రమోద్,మహిళా కాంగ్రెస్ నాయకులు పోల ఉష, స్వప్న, అపర్ణ , ఏయంసి డైరెక్టర్ రఘు ,పూల శంకర్, అహ్మద్ ,ఆకుల మహేందర్, పుప్పాల రవి ,రాజు గగన్, మరియు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper