మృగషిర కార్తె సందర్భంగా మోహన్ రావు పాటిల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవంతంగా అంబలి పంపిణీ కార్యక్రమం
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి స్థానిక భైంసా పట్టణంలోని భైంసా జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ ఫ్యాక్టరీలో *మృగషిర కార్తె సందర్భంగా మోహన్ రావు పాటిల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో అంబలి పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు*. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, రైతులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని అంబలిని స్వీకరించారు.ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పాటిల్ మాట్లాడుతూ, *మృగషిర కార్తె రైతాంగానికి ఎంతో ముఖ్యమైన కాలమని, ఈ సంవత్సరం వర్షాలు సకాలంలో కురిసి రైతులకు అనుకూల పరిస్థితులు నెలకొనాలని భగవంతుణ్ణి కోరడం జరిగింది* అదే విధంగా. ప్రతి రైతు కష్టానికి తగిన ఫలితం దక్కి, అధిక దిగుబడులు సాధించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరడం జరిగింది.