80వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని కాట్రేనికోన మండలంలో మొక్కలు నాటే కార్యక్రమం

August 14, 2026 | ఆంధ్రప్రదేశ్

పయనించే సూర్యుడు ఆగస్టు 14 ముమ్మిడివరం (ప్రతినిధి గ్రంధి నానాజీ)డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లా కాట్రేనికోన80వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని కాట్రేనికోన మండలం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద మండల పరిషత్ అభివృద్ధి అధికారి బి రాజేశ్వర్ రావు, వైద్యాధికారి పి నీలిమ నేతృత్వంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. వికసిత్ భారత్ 2047 లో భాగంగా పర్యావరణ హితమే లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ తమ పరిసరాల్లో మొక్కలు నాటాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉప మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎన్ శంకర్ నారాయణ, సమాజ ఆరోగ్య అధికారి శేషుబాబు, పంచాయతీ కార్యదర్శి జె వి సత్యనారాయణ, శాంతిస్వరూప్, గ్రామ బృంద సభ్యుడు రాంజీ, క్షేత్ర సహాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper