తెలంగాణ

9వ ఫేజ్ కాలనీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ సభ్యులతో సమావేశమైన టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బండి రమేష్

9వ ఫేజ్ కాలనీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ సభ్యులతో సమావేశమైన టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్  బండి రమేష్

ప యనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 15 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కేపీహెచ్‌బీ 9వ ఫేజ్ కాలనీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ సభ్యులు, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సభ్యులు ఈరోజు కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం శ్రీ హేమ దుర్గాభవన్‌లో టీపీసీసీ ఉపాధ్యక్షులు మరియు కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బండి రమేష్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను ఆయనకు పరిచయం చేసి, కాలనీలో నెలకొన్న సమస్యలు, మౌలిక సదుపాయాల అవసరాలు, నివాసితుల సంక్షేమం, భవిష్యత్తులో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, కాలనీల అభివృద్ధి, ప్రజల సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పనకు తాను ఎల్లప్పుడూ సహకరిస్తానని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. కాలనీల అభివృద్ధిలో సంక్షేమ సంఘాల పాత్ర ఎంతో కీలకమని, ప్రజల అవసరాలను గుర్తించి ఐకమత్యంతో ముందుకు సాగినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.అలాగే, 9వ ఫేజ్ కాలనీ అభివృద్ధి కోసం నూతన కార్యవర్గ సభ్యులు చేస్తున్న కృషిని అభినందిస్తూ, సీనియర్ సిటిజన్స్ అనుభవం, సలహాలు, మార్గదర్శకత్వం కాలనీ అభివృద్ధికి ఎంతో ఉపయోగ పడతాయని పేర్కొన్నారు. పెద్దల సూచనలను గౌరవిస్తూ, యువత మరియు కాలనీ వాసుల భాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.కాలనీ అభివృద్ధి అనేది ఏ ఒక్కరి బాధ్యత మాత్రమే కాదని, ప్రతి నివాసితుడి భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని బండి రమేష్ గారు అన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ ఐకమత్యంతో పనిచేస్తూ, 9వ ఫేజ్ కాలనీని పరిశుభ్రమైన, సురక్షితమైన, మెరుగైన మౌలిక సదుపాయాలు కలిగిన ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దేందుకు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో పాల్గొన్న సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సభ్యులకు, కాలనీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. కాలనీ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం చేపట్టే నిర్మాణాత్మక కార్యక్రమాలకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారుఈ కార్యక్రమంలోజి. రామకృష్ణారెడ్డి, కె. రాహుల్, కె. చంద్ర మోహన్ రెడ్డి, ఎం. వీర గోవిందరావు, ఎన్. తిలక్ కుమార్, కృష్ణార్జున రెడ్డి, ఈశ్వర రెడ్డి, పి.వి. సత్యనారాయణ, యాదిరెడ్డి, వై. వెంకటరత్నం, విజయ్ కుమార్, ఈశ్వర్ రెడ్డి, నాగేశ్వరరావు, రామకృష్ణ రాజు, మధుసూదన్ రెడ్డి, చారి, నందయ్య, బాబూరావు, బి. వెంకటేశ్వరరావు, కిల్లారు శ్రీనివాస్ బాబు, చావా శ్రీనివాస్ బాబు తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS