రుద్రూర్, పయనించే సూర్యుడు న్యూస్ : నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల తహసీల్దార్ బి. తారాబాయి సస్పెన్షన్ అనంతరం ఖాళీ అయిన స్థానంలో నూతన నియామకం జరిగింది. మండలంలో ప్రస్తుతం డిప్యూటీ తహసీల్దార్ గా కొనసాగుతున్న సురేందర్ నాయక్ ను రుద్రూర్ మండల తహసీల్దార్ (FAC) గా నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు నేడు సురేందర్ నాయక్ రుద్రూర్ తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరించారు. SIR ప్రక్రియ, మండల రెవెన్యూ పరిపాలన నిరంతరాయంగా కొనసాగేందుకు ఈ నియామకం జరిగింది. తదుపరి పూర్తిస్థాయి నియామక ఉత్తర్వులు వచ్చే వరకు FAC కొనసాగుతారు.