ప్రీ ప్రైమరీ పీఎం శ్రీవిద్య కేంద్రాలను వెంటనే రద్దు చేయాలి…
వాటిని అంగన్వాడీ లకు అప్ప జెప్పాలని మండల విద్యాధికారి ఎంఈఓ నిజముద్దీన్, తహసిల్దార్ శ్రీనివాస్ వేరువేరుగా వినతి పత్రాలు అందజేత…
:పయనించే సూర్యుడు మే 7కృష్ణ : ప్రీ ప్రైమరీ పీఎం శ్రీవిద్య కేంద్రాలను అంగన్వాడీలకు అప్పజెప్పాలని, వాటిని ప్రత్యేకంగా నిర్వహించే పద్ధతిని ప్రభుత్వం మానుకోవాలని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు కృష్ణ మండలం నాయకురాలు మల్లమ్మ, సి ఆర్ గోవింద్ రాజ్ సిఐటియు జిల్లా అధ్యక్షులు లీలావతి రాగసుధ డిమాండ్ చేశారు. శనివారం రోజు కృష్ణ మండలం ఎంఈఓ నిజముద్దీన్, తహసిల్దార్ శ్రీనివాస్ వేరువేరుగా వినతిపత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిఐటియు జిల్లా అధ్యక్షులు గోవింద్ రాజ్ నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా అంగన్వాడీల కేంద్రాలకు ఎస్రుపెట్టే కార్యక్రమాన్ని కి పూనుకున్నదని విమర్శించారు. అందులో భాగంగా ప్రీ ప్రైమరీ స్కూళ్లను మరియు పిఎం శ్రీవిద్యను ప్రవేశపెడుతున్నారని అన్నారు. అంగన్వాడీలకు నష్టం కలిగించే ప్రీ ప్రైమరీ స్కూల్ పీఎం శ్రీవిద్య ను గ్రామాలలో అమలు చెయ్యమని వాటిని అంగన్వాడీలకు అప్పజెప్పాలి. అంగన్వాడి టీచర్లకు హెల్పర్లకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని ఉద్యోగ భద్రత కల్పించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 18 వేల రూపాయలు వేతనాలు ఇవ్వాలని హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మల్లమ్మ, రాగ సుధా, లక్ష్మి, లీలావతి, మహేశ్వరి పి చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.