పలు బాధిత కుటుంబాలను పరామర్శించిన మానాల మోహన్ రెడ్డి
పయనించే సూర్యుడు D.06.06.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ :ఈరోజు శనివారం రోజున ఎర్గట్ల మండలంలోని పలు గ్రామాలలో బాధిత కుటుంబాలను పరామర్శించిన రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి ఎర్గట్ల మండలంలోని తాళ్ల రాంపూర్ గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్త లాలూ సింగ్ అమ్మగారు ఇటీవల అనారోగ్యంతో మరణించారు వారి కుటుంబాన్ని పరామర్శించారు .గుమిర్యాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గజేందర్ వాళ్ళ నాన్నగారు మరణించారు వారి కుటుంబాన్ని పరామర్శించారు.తడపాకల్ గ్రామంలో ఇటీవల పిడుగుపాటుకు గురైన సునీత కుటుంబ సభ్యుల్ని పరమర్శించారు కార్యక్రమంలో వివిధ ఏరుగట్ల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు సోమదేవరెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గంగా ప్రసాద్ జిల్లా కార్యవర్గ వివిధ గ్రామ సర్పంచులు ఉపసర్పంచ్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు