భీంగల్‌లో జరిగిన విషాద ఘటన బాధాకరం* *బాధిత కుటుంబాలకు 18000 ఆర్థిక సహాయం అందజేత
పయనించే సూర్యుడు 7 జూన్ 20 26 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్*ప్రమాదానికి కారణం అయిన నీటి కుంట పరిశీలన* బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిభీంగల్ మున్సిపాలిటీ పరిధిలోని లింబాద్రి గుట్ట వద్ద నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న రెండు కుటుంబాలకు చెందిన ముగ్గురు చిన్నారులు శుక్రవారం ఆడుకోవడానికి వెళ్లి వారి గుడిసెల వెనుక ఉన్న కుంటలో పడి మృతి చెందడం తీవ్ర విషాదకరమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.ఈ నేపథ్యంలో ఆదివారం బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. చిన్నారులను కోల్పోయిన తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతమని పేర్కొంటూ వారిని ఓదార్చారు.ఈ ఘటనలో కుమార్తె, కుమారుడిని కోల్పోయిన ఓ తల్లి తీవ్ర మనోవేదనతో అదే కుంటలో దూకేందుకు ప్రయత్నించగా ఆమె కాలికి గాయమైన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. అలాగే చికిత్సకు సంబంధించిన ఎలాంటి బిల్లులు తీసుకోవద్దని వైద్యులకు తెలిపారు.అనంతరం ఎమ్మెల్యే శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి తహసీల్దార్ (MRO), ఎంపీడీఓ (MPDO) తదితర అధికారులతో ఫోన్‌లో మాట్లాడి బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అన్ని విధాల సహాయం అందించాలని కోరారు. ముఖ్యంగా వారికి పక్కా ఇళ్లు మంజూరు చేసే దిశగా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.అదేవిధంగా ప్రమాదానికి కారణం అయిన నీటి కుంటను పరిశీలించిన ఎమ్మెల్యే వేముల ఇలాంటి విషాద ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా సంబంధిత కుంట చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేయడం లేదా అవసరమైతే కుంటను పూడ్చివేయడం వంటి చర్యలను పరిశీలించాలని అధికారులకు సూచించారు . వెంటనే ఘటన స్థలాన్ని సందర్శించాలని అధికారులను కోరారు.ఈ సందర్బంగా ఆ కుటుంబాలకు ఖర్చుల నిమిత్తం 18000 ఆర్థిక సహాయం అందజేశారు.