బాధిత కుటుంబాలను పరామర్శించిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్

June 7, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు 7 జూన్ 20 26 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ : బాల్కొండ నియోజకవర్గం లో
భీంగల్ మండల కేంద్రంలోని లింబాద్రిగుట్ట వద్ద గల బ్రాహ్మణ కుంటలో పడి ముగ్గురు పిల్లల మృతి చెందిన వడ్డెర కాలనీకి సంబంధించినటువంటి ముగ్గురు పిల్లలు ధ్యరంగుల అరవింద్ S/o సురేష్, కంది వర్షిని D/o మహేష్, కంది హరీష్ D/o మహేష్ ఈm ఆడుకుంటూ పక్కనే ఉన్న బ్రాహ్మణ కుంట వద్ద ప్రమాదవశాత్తు పడి దానిలో మునిగి చనిపోయారు. ఈరోజు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలపడం జరిగింది. వారి కుటుంబాలను ప్రభుత్వం తరుపున అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో భీంగల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్ టౌన్ ప్రెసిడెంట్ అనంతరావు సర్పంచులు ఉప సర్పంచ్లు మరియు కౌన్సిలర్ లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper