మంత్రి పదవి చెపట్టి సంవత్సరం పూర్తి అయినా సందర్బంగా మాధ్వార్ లో పంచామృత అభిషేకం

June 8, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు జూన్9మక్తల్ :మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర మంత్రివ.డా. వాకిటి శ్రీహరి. మంత్రి పదవి చేపట్టి సంవత్సరం పూర్తయిన శుభ సందర్భంగా మాధ్వర్ గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ గట్టు తిమ్మప్ప స్వామి మరియు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పంచామృత అభిషేక పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ పూజా కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాట్లాడుతూ వాకిటి శ్రీహరి లాంటి మంత్రి ఉండడం వలన తెలంగాణకు పేరు వచ్చింది అని కొనియాడారు అలాగే మక్తల్ ప్రాంతం ప్రజలకు అనేక సమస్యలు సైతమ రాష్ట్ర మంత్రి మండలిలో వివరిస్తూ పరిసస్కార దిశగా నిరంతరం శ్రామిస్తారు అని అన్నారు ఈ కార్యక్రమంలో . కాంగ్రెస్ సీనియర్ నాయకులు.రాజేశ్వర్ రావు, బొంబాయి శంకర్, వడ్ల సత్యనారాయణ, వడ్ల బాలరాజ్, సక్రెమోలా నరసింహ, సక్రెమోలా తిమ్మప్ప, బాట విశ్వనాధ్, అరికేరి సవరప్ప, ప్యాట ఎల్లప్ప, ప్యాట చిన్న తిమ్మప్ప, ప్యాట హన్మంత్, బుడబోయి సురేష్, చాకలి వెంకటప్ప, బలిజ సిద్దు, వడ్ల నర్సింహా, బుడబోయి బాలు తదితరులు పాల్గొని స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.మంత్రి రాష్ట్ర ప్రజలకు మరింత సేవ చేసే శక్తిని ప్రసాదించాలని స్వామి వారిని కోరుకున్నారు.

🌐 Select Language:
📰 ePaper