పురపాలక సంఘం భీంగల్ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్య చరణ ప్రణాళిక
పయనించే సూర్యుడు 8 జూన్ 20 26 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్: పురపాలక సంఘం భీంగల్ – ప్రజాపాలన – ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు వార్డ్ నెం. 7.9.11 వార్డులలో వార్డ్ సభలను చైర్ పర్సన్ బోదిరే నాగమణి స్వామి అధ్యక్షతన నిర్వహించడం జరిగిందని కమిషనర్ డీ. గజానంద్ తెలిపారు. ఈ సమావేశంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికకు సంబంధించిన అనేక అంశాలను ప్రజలకు వివరించారు.ప్లాస్టిక్ కవర్ల నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఫంక్షన్ జరిగే కార్యక్రమాల్లో ప్లాస్టిక్ ఇస్తారు కాకుండా స్టిల్ ప్లేట్లు వాడాలన్నారు. క్యాన్సర్ మహమ్మారికి ప్లాస్టిక్ కే ముఖ్య కారణం అని ప్రజలకు అందరూ వివరించారు. త్వరలో మున్సిపల్ ఆధ్వర్యంలో నూతన వాహనాలు కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. నూతన గృహ నిర్మాణాలు చేపట్టేవారు తప్పనిసరిగా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలన్నారు. ఇప్పుడు జరుగుతున్న SIR ప్రజలందరూఉపయోగించుకోవాలన్నారు. ఓటుకు హక్కు ఉన్నవారందరూ తప్పనిసరిగా SIR మ్యాపింగ్ చేయించుకోవాలన్నారు.రాబోయ్యే వర్షాకాలం వర్షాకాల సన్నద్ధత, ప్రజలు డెంగ్యూ మలేరియా బరిన పడకుండా పరిసరాల పరిశుభ్రత, సురక్షిత తాగునీరు, తడి-పొడి చెత్త సేకరణ గురించి ప్రజలకు అవగాహనా మరియు సూచనలు చేయడం జరిగినది ఈ యొక్క వర్షాకాలములో ప్రతి ఒక్కరు మొక్కలు నాటావాలేనని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ యొక్క కార్యక్రములో వివిధ శాఖల అధికారులు వారి యొక్క ప్రగతి ప్రణాళికను చదివి వినిపించారు. కార్యక్రమంలో సంటి నర్సయ్య కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ అనంతరావు. కౌన్సిలర్ అంజుమ్ ఆలీ. నీలం రవి. సంగ్యా నాయక్. ఎస్సై తిరుపతి. మరియు వివిధ శాఖల అధికారులు మహిళా సంఘ సభ్యులు, వార్డ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు…