రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా వేల్పూర్ మండల మహిళా సమాఖ్య కు కేటాయించిన నూతన ఆర్టీసీ బస్సు ప్రారంభం

June 9, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు 9 జూన్ 20 26 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ ; బాల్కొండ నియోజకవర్గం లో వేల్పూర్ మండలం లో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో అమలు చేస్తున్న మహిళా సాధికార లో భాగంగా ఈరోజు మంగళవారం రోజున హైదరాబాదులో రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలకు ప్రతి మండలానికి ఒకటి చొప్పున 553 బస్సులను ప్రారంభించడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి వేల్పూర్ మండలం నుంచి మహిళా సమాఖ్య సభ్యులతోపాటు అధికారులు వెళ్లడం జరిగింది వారికి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం నర్సారెడ్డి శుభాకాంక్షలు తెలిపి పంపడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 30 లక్షలు మండల మహిళా సంఘాలు 6 లక్షలతో బస్సు కొనుగోలు చేయడం జరిగింది వీరు RTC కీ అద్దెకు ఇవ్వడం తో ప్రతినెల రూపాయలు 70వెయ్యిలు మండల సమైక్యకు జమ చేయడం జరుగుతుంది మహిళల పట్ల ఉన్న గౌరవం వారిని ఆర్థికంగా లాభం చెయ్యడం జరుగుతుంది ముఖ్యమంత్రి కి వేల్పూర్ మహిళా తరఫున అట్లాగే కాంగ్రెస్ పార్టీ తరఫున వేల్పూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అనిల్ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏపిఎం మాణిక్యం, సీసీలు మురళి,రాధ, గ్రామ శాఖ అధ్యక్షుడు రాజేందర్, మండల జనరల్ సెక్రెటరీ రమణ, కిషన్ సెల్ అధ్యక్షులు రవి, నాయకులు మాణిక్యం,బాలయ్య, వినోద్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా సమైక్య సభ్యులు పాల్గొనడం జరిగింది

🌐 Select Language:
📰 ePaper