సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించడం సరికాదు
*ఆదివాసి కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్*
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రజా పాలనను రజాకార్ల పాలనగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు పోల్చడాన్ని ఆదివాసి కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా చైర్మన్ బానోతు గోవింద నాయక్ తప్పుబట్టారు ప్రధాని మోదీ మెప్పు పొందేందుకు రామచంద్రరావు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఆయన గురువారం మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సోనియా గాంధీ ద్వారానే సాధ్యమైందని గుర్తు చేశారు. బిజెపి నాయకులు సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించడం సరికాదన్నారు. బిజెపి కేంద్ర మంత్రులు పొంతనలేని మాటలు మాట్లాడుతూ ఆసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.