నిర్మల్ జిల్లా కళాశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు 50% ఫీజు రాయితీ కల్పించాలి

June 11, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి : నిర్మల్ : కళాశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు 50% ఫీజు రాయితీ కల్పించాలని తెలంగాణ రాష్ట్ర జర్నలిస్ట్ యూనియన్ (టిఎస్ జేయు) నిర్మల్ జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం రోజు ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి జాదవ్ పరశురాంకు టీఎస్ జేయు జిల్లా నాయకులు మెమోరండం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కళాశాలల్లో చదువుతున్న జర్నలిస్టుల విద్యార్థులకు కళాశాల ఫీజుల్లో 50 శాతం రాయితీ కల్పించాలని ఆయనకు కోరారు. ఇందుకు డిఐఈఓ సానుకూలంగా స్పందించి ఫీజులో 50% రాయితీ కల్పిస్తామని హామీనిచ్చారు. వెంటనే స్పందించిన డిఐఈఓ ఫీజు రాయితీకి సంబంధించిన సర్కులర్ కాపీని టిఎస్ జేయు నాయకులకు అందజేశారు. ఇందులో టీఎస్ జేయు నిర్మల్ జిల్లా అధ్యక్షులు సిరిగే రమేష్, ఉపాధ్యక్షులు సురేష్, ప్రధాన కార్యదర్శి, పొన్నం రాహుల్ గౌడ్, కోశాధికారి మందుల భీమేష్ లు ఉన్నారు.

🌐 Select Language:
📰 ePaper