సీసీ రోడ్డు ప్రొసీడింగ్ కాపీ అందజేసిన ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ జి.విఠల్ రెడ్డి.
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో: తానుర్ మండలంలోని దాగం గ్రామంలో సుమారు 5 లక్షల రూపాయల సీసీ రోడ్డు ప్రొసీడింగ్ కాపీని గ్రామ సర్పంచ్ కు అందజేయడం జరిగింది. నిధులు మంజూరు చేసి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ జీ. విఠల్ రెడ్డి కి గ్రామం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సాయినాథ్, సీనియర్ నాయకులు పి. గోవింద్ ఉన్నారు.