విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు మరియు నోట్ బుక్కుల పంపిణీ

June 15, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు గాంధారి 16/06/26 మండల కేంద్రంలోని గౌరారం కలాన్ లో గల జిల్లా పరిషత్ ఉన్నత మరియు ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థిని, విద్యార్థులకు సర్పంచ్ సువర్ణ అనిల్ గౌడ్, మండల విద్యాశాఖ అధికారి శ్రీహరి ఆధ్వర్యంలో పుస్తకాలను పంపిణీ చేశారు. విద్యా సంవత్సరానికి స్వాగతం పలుకుతూ పాఠశాలలో నమోదు శాతాన్ని పెంచే విధంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు సహకరించాలని కోరారు. తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశంలో ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్యతోపాటు, ఆహల్లాదకరమైన వాతావరణంలో అన్ని కృత్యాలు నిర్వహిస్తారని తెలిపారు. విద్యార్థులు సమయపాలన పాటించే విధంగా తల్లిదండ్రులు సహకరించారని సర్పంచ్ సువర్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ సంతోష్, అంజాగౌడ్, రవీందర్ గౌడ్, రమేష్ ఉపాధ్యాయులు రాములు, సాహేద్ బాబు, ఉమామహేశ్వర్, నిరోషా సరోజ, సరిత మరియు పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper