భూంపల్లి ప్రాథమిక పాఠశాలను జిల్లాకే ఆదర్శవంత పాఠశాలగా తీర్చిదిద్దుతున్నారు

June 17, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు గాంధారి 18/06/26 విద్యార్థులుకు పాఠ్యపుస్తకాలు పంపిణీ . పాఠశాలలు ప్రీ ప్రైమరీ తరగతిని ప్రారంభించిన గ్రామ సర్పంచ్ గైని శ్రీనివాస్ .పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ గైని శ్రీనివాస్.కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల్ భూంపల్లి ప్రాథమిక పాఠశాల బుధవారం గ్రామ సర్పంచ్ గైని శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు మరియు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు అనంతరం పాఠశాలను ప్రీ ప్రైమరీ తరగతి గదిని ప్రారంభించారు. అనంతరం అక్షరాభ్యాసం చేయించిన గ్రామ సర్పంచ్ గైని శ్రీనివాస్. ఈ సందర్భంగా సర్పంచ్ గైని శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులను. విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తుకు దోహదం చేసేలా జ్ఞానమైన విద్య బోధన అందిస్తున్నారన్నారు. గ్రామ ప్రజలు కూడా పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ప్రవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పిస్తున్నారని. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దానే రాజయ్య పంచాయతీ కార్యదర్శి సునంద. వార్డ్ మెంబర్లు మరియు ప్రధానోపాధ్యాయులు వీరమల్లు మురళి ఉపాధ్యాయులు జి సువర్ణ. ఎస్ నవీన కుమారి. ఎం నాగ సుష్మ. స్కూల్ చైర్మన్ నిర్మల మరియు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper