మహిళా భావన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న మానాల మోహన్ రెడ్డి
పయనించే సూర్యుడుD.18.06.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్ : కమ్మర్ పల్లి మండలంలోని అమీర్ నగర్ గ్రామంలో మహిళా భవన భూమి పూజ కార్యక్రమంలో రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశానుసారం రాష్ట్రంలో ప్రతి మహిళ సంఘానికి గ్రామంలో మహిళా సంఘం బిల్డింగ్ ఉండాలని ఒక సంకల్పాన్ని తీసుకున్నటువంటి సందర్భంలో అందులో భాగంగానే అమీర్ నగర్ గ్రామంలో కూడా 10 లక్షల రూపాయలతో మహిళా సంఘం బిల్డింగ్ మంజూరు కావడం జరిగింది దానికి సంబంధించిన పనులు ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ రాష్ట్రంలో మహిళల సంక్షేమం కోసం మహిళల ఉన్నతి కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి కార్యక్రమాలను వాటిని అనుసరిస్తున్న విధానాలకు ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కి ప్రత్యేకంగా అమీర్ నగర్ మహిళా సంఘాల పక్షాన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.అమీర్ నగర్ గ్రామంలో ఈ మహిళా బిల్డింగ్ తో పాటు 30 లక్షల రూపాయలతో ఎరువుల గోదాం కూడా మంజూరు చేయడం జరిగింది అవి కూడా పనులు నడుస్తున్నాయి అదే విధంగా ఈ గ్రామలో సబ్ స్టేషన్ సంబంధించి కూడా గవర్నమెంట్ కి ప్రపోసల్ పంపించటం జరిగింది అని తెలిపారు. సబ్స్టేషన్ మంజూరు కి కృషి చేస్తాం కచ్చితంగా ఒక్కొక్కటిగా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు మహిళలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ ఈ రోజు బస్సులో యజమానులుగా మారారు అదేవిధంగా సౌర విద్యుత్ రంగంలోకి వెళ్లారు అదే విధంగా పడి ప్రపోట్మెంట్ సెంటర్ లను మహిళా సంఘాలకే ఇచ్చి ఆర్థికంగ పరిపూష్టి చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నం చాలా హర్షనీయం ఖచ్చితంగా మహిళలకు ఏ అవకాశాలు ఉన్న ఆ అవకాశం అందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ముందుగా ఉంటుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో కమ్మర్పల్లి మండల ప్రెసిడెంట్ భాస్కర్ మాజీ ప్రెసిడెంట్ రవి ఇనయత్ నగర్ సర్పంచ్ బానవత్ లలిత రాములు నాయక్ ఉపసర్పంచ్ మకిలి అనిల్ డీసీసీ కార్యదర్శి పొడెండ్ల సంజీవ్ గ్రామ శాఖ అధ్యక్షులు కందరి భూమరెడ్డి క్యాతం గంగారెడ్డి కనూరి లింబాద్రి పుప్పాల నర్సయ్య రాజుల రమేష్ శ్రవణ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు