సమాజానికి ఉప్పల వెంకటేష్ అందిస్తున్న సేవలు అభినందనీయమైనవి
ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి
తలకొండపల్లిలో ఉప్పల బాలికల ఆశ్రమ పాఠశాల ప్రారంభోత్సవం
ప్రారంభించిన మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్,లక్ష్మారెడ్డి,ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, శేషరెడ్డి
( పయనించే సూర్యుడు జూన్ 19 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ ) కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండల కేంద్రంలో మాజీ జడ్పీటీసి మరియు మిషన్ భగీరథ మాజీ చైర్మన్ ఉప్పల వెంకటేష్ ఏర్పాటు చేసిన ఉప్పల బాలికల ఆశ్రమ పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్,లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్,శేషారెడ్డి తదితరులు పాల్గొని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సి నవీన్ రెడ్డి మాట్లాడుతూ బాలికల విద్యాభివృద్ధికి ఇటువంటి విద్యాసంస్థలు ఎంతో దోహదపడతాయని విద్యా, సామాజిక రంగాల్లో ఆయన చేస్తున్న కృషి సమాజానికి ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు.ఉప్పల వెంకటేష్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ప్రశంసించారు.ముఖ్యంగా బాలికల విద్యాభివృద్ధి కోసం ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.ఉప్పల వెంకటేష్ భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తరించి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.ఈ ప్రారంభోత్సవంలో మాదేవ్ పూర్ సర్పంచ్ అనూష రవీందర్ రెడ్డి,మాజీ సర్పంచ్ హరి నాయక్,షాద్ నగర్ ప్రముఖులు మలిపెద్ధి శంకర్,సంగేమ్ గోపాల్ రెడ్డి,కల్వకుర్తి మాజీ జెడ్పిటిసిలు మాజీ ఎంపీపీలు,సర్పంచులు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.