ఆవులకు విషం ఇచ్చిన నిందితులను కఠినంగా శిక్షించాలి
మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
కుమ్మరిగూడెంలో రైతు రఘునందన్ ను ఓదార్చిన మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
( పయనించే సూర్యుడు జూన్ 20 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని కుమ్మరిగూడకు రైతు రఘునందన్ కి చెందిన 08 ఆవుల మృతి చెందిన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సంఘటన స్థలానికి చేరుకొని జరిగిన సంఘటనపై ఆరా తీశారు. షెడ్ లో బీహార్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు పనిచేస్తున్నారు. బుధవారం రాత్రి కొందరు మురుకుల దాన మరియు పత్తి చెక్కలో అత్యంత నిర్లక్ష్యంగా యూరియా కలిపి, అక్కడి నుండి పరారయ్యారు. శుక్రవారం ఉదయం దానలో యూరియా కలిసిన సంగతి గమనించని యజమాని రఘునందన్ ఎప్పటిలాగే ఆవులకు ఆ మేతను వేశాడు. ఆ దాన తిన్న కొద్దిసేపటికే ఆవులు తీవ్ర అస్వస్థతకు గురయ్యాయి. ఊపిరాడక ఒకదాని తర్వాత ఒకటి విలవిలలాడుతూ కిందపడిపోయాయి.ఈ ప్రమాదంలో మొత్తం 8 ఆవులు, ఒక దూడ అక్కడికక్కడే మరణించినట్లు రైతు రఘునందన్ తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్, కౌన్సిలర్స్ కోస్గి శ్రీనివాస్,చంద్రకళ రాజేందర్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు రవి నాయక్, వెంకటేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.