చింత గట్టు తాండలో బడిబాట కార్యక్రమం

June 19, 2026 | తెలంగాణ

పాల్గొన్న సర్పంచ్ విస్లావత్ బాసు నాయక్

( పయనించే సూర్యుడు జూన్ 20 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్)ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచి పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని సిద్దాపూర్ సర్పంచ్ బాసు నాయక్ అన్నారు. కొత్తూరు మండలంలోని సిద్ధాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని చింతగట్టు తాండలో సర్పంచ్ బాసు నాయక్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులతో కలిసి బడిబాట కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ..గ్రామ పంచాయతీలో తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాల ఉండే విధంగా చర్యలు తీసుకొని పేద,మధ్య తరగతి తల్లిదండ్రులపై ఆర్థికభారం పడకుండా చూసేందుకు ఈ కార్యక్రమం చేపట్టిందని సర్పంచ్ బాసు నాయక్ సూచించారు. విద్యార్థులకు 21 రకాల వస్తువులతో కిట్లు అందజేయబడతాయని ఆయన తెలిపారు.అలాగే ఉదయం టిఫిన్,మధ్యాహ్నం భోజనం గుడ్లు,రాగి జావ,పాలు వంటి పోషకాహారం అందించడంతో పాటు నాణ్యమైన విద్య అందించబడుతుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ దోబ్బల యాదయ్య, గ్రామ పంచాయతీ సెక్రెటరీ కుమార్,ప్రధానోపాధ్యాయుడు చంద్రయ్య,అంగన్వాడీ టీచర్స్ సునీత,నాయకులు వెంకట్, మహిపాల్,తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper