పాఠశాల విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాల అందజేత
పయనించే సూర్యుడు జూన్ 19 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) : కర్రి శ్రీనివాస్ విద్యా సేవా సమితి అధ్యక్షుడు కర్రి శ్రీనివాస్ ప్రభుత్వ పాఠశాలలో చదువు కుంటున్న ఎందరో పేద విద్యార్థులకు అండగ ఉంటున్నారు. కాట్రేనికోన మండలం నడవపల్లి పంచాయతీ శివారు పల్లిపాలెం గ్రామానికి చెందిన కర్రి శ్రీనివాస్ చదువుకునే వారంటే చాలా ఇష్టం. ఆయన కూడా తాను చదువుకునే రోజుల్లో ఎన్నో కష్టాలు అనుభవించారు. తనలా పాఠశాలలో చదువుకునే విద్యార్థులు ఎవరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు అండగా ఉంటున్నారు. గత 20 ఏళ్లుగా ప్రతి ఏడాది జూన్ 15న తన పుట్టిన రోజును పురస్కరించుకుని వందలాది మంది పిల్లలకు నోటు పుస్తకాలను అందజేస్తున్నారు. కుంచనపల్లి, పల్లిపాలెం, పల్లంకుర్రు, కుండలేశ్వరం,నడవపల్లి, లచ్చిరాజు చెరువు, వెంకమ్మ చెరువు, కొప్పిగుంట, తదితర ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు ప్రతి ఏడాది నోటు పుస్తకాలు, పెన్నులు, ఉచితంగా అందిస్తున్నారు. గత యేడాది 650 మంది పిల్లలకు పుస్తకాలు అందించగా ఈ ఏడాది ఇంత వరకు 450 మంది వరకు పుస్తకాలు అందజేసారు.దీనిలో భాగంగా గురువారం నడవపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో 65 మంది విద్యార్థులకు నోటు పుస్తకాలను శ్రీనివాస్ సోదరుడు రామకృష్ణ చేతుల మీదుగా అందించారు. పాఠశాలల్లో చదువుకుంటున్న పిల్లలకు తన వంతుగా ఏదైనా చేయాలనే ఆలోచనతోనే గత 20 ఏళ్లుగా విద్యార్థులకు పుస్తకాలు, విద్య సామాగ్రి అందిస్తున్నాని దాత కర్రి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సేవలను పలువురు తల్లిదండ్రులు, గ్రామస్తులు, ఉపాధ్యాయులు కొనియాడారు. గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులకు ఆయన అండగా ఉండటం ఎంతో అభినందనీయ మన్నారు. హెచ్ఎం సుందర రావు, నరసింహమూర్తి, ఉపాధ్యాయులు, విద్యారులు పాల్గొన్నారు.