పంచాయతీ కార్యదర్శిగా శ్రీకాంత్ సేవలు ఆదర్శనీయం

June 20, 2026 | తెలంగాణ

…….అశ్వాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ బానోత్ సదర్ లాల్.

పయనించే సూర్యుడు, అశ్వాపురం, జూన్20: అశ్వాపురం మేజర్ గ్రామ పంచాయతీ ఇంచార్జీ కార్యదర్శిగా కందిమళ్ళ శ్రీకాంత్ సేవలు ఆదర్శప్రాయమని, అశ్వాపురం సర్పంచ్ బానోత్ సదర్ లాల్ పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఆధ్వర్యంలో పాలక వర్గ సభ్యులు, కార్యాలయ సిబ్బంది, ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు, ఇతర శాఖల సిబ్బంది, గ్రామ పెద్దలు, రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో ఆయన పూల మాల వేసి,బొకేని అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు నెలల పాటు గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుధ్య, త్రాగునీటి నిర్వహణ, అభివృద్ధి పనులు,పరిపాలనా పరమైన అంశాలలో వారి సేవలు హర్షణీయమని కొనియాడారు.కార్యాలయ వేళలతో సంబంధం లేకుండా అవసరమైనప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ సత్వర సేవలు అందించడంలో తనదైన ముద్ర వేసుకున్నారని ప్రశంసించారు.ముఖ్యంగా ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా తొంబై తొమ్మిది రోజులపాటు రోజువారి కార్యక్రమాలు చేపట్టడంలో సమర్ధవంతమైన ప్రణాళికతో రోజువారి కార్యక్రమాలు చేపట్టడంలో చూపిన చొరవ ప్రశంసనీయమని కొనియాడారు.ఉప సర్పంచ్ తుళ్ళూరి ప్రకాష్ మాట్లాడుతూ కార్యదర్శి శ్రీకాంత్ ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలు తీర్చడంలో అంకిత భావంతో పనిచేసిన తీరు అందరికీ ఆదర్శమని, ఏక కాలంలో వివిధ గ్రామ పంచాయతీలు బాధ్యతలు నిర్వహించిన ఆయన ఎక్కడ పనిచేసినా సమర్థవంతమైన నాయకత్వాన్ని ప్రదర్శించారని. కొనియాడారు వార్డు సభ్యులు చంద్రకళ,హసిత వారి సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు వేములపల్లి హసీత,మొరివినేనిచంద్రకళ, చిక్కపద్మ ,జరుపుల కౌసల్య, కోర్స ముత్తమ్మ ,కణతాల ధనలక్ష్మి , చెట్టిపల్లి రమాదేవి,ఏఐటీయూసీ నాయకులు రాజేష్,మేకల భాస్కర్, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper