స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్రకుపర్యావరణ పరిరక్షణలో యువత ముందుండాలి- ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు
పయ నించే సూర్యుడు, జూన్ 20:* (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ) చెత్త నుంచి సంపద సృష్టిద్దాం పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి చెత్త నుంచి సంపద సృష్టించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని ఆయన అన్నారు.*స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాఐ. పోలవరం మండలం మురమళ్ళ గ్రామం, పితాని వారి పాలెంలోని అంగన్‌వాడీ కేంద్రం వద్ద నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం లక్ష్యాలను ప్రజలకు వివరించి, పరిశుభ్రమైన గ్రామాల నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పారిశుధ్యం, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు మరింత ప్రాధాన్యత లభిస్తుందని పేర్కొన్నారు.అనంతరం అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే అక్కడ చిన్నారులకు అందిస్తున్న పోషకాహారం, మధ్యాహ్న భోజనం నాణ్యతను స్వయంగా పరిశీలించారు. పిల్లల ఆరోగ్యం, పోషకాహారంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. కేంద్రంలోని సౌకర్యాలు, నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేస్తూ సిబ్బందికి పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అంగన్‌వాడీ సిబ్బంది, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.