మా ఊరు బడి మాకు కావాలి
పయనించే సూర్యుడు జూన్ 20 (సూళ్లూరుపేట నియోజవర్గ రిపోర్టర్ దాసు )తిరుపతి జిల్లా ఓజిలి మండలం తిరుమలపుడి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల లో ఒకటవ తరగతి నుండి 5వ తరగతి వరకు ఉండేది కానీ ఇప్పుడు రెండో తరగతి వరకే పరిమితం చేశారు మా గ్రామంలోని విద్యార్థులు మూడో తరగతికి వెళ్లాలంటే 7 కిలోమీటర్లు దూరంలో ఉన్న వేరే గ్రామానికి కాలినడకన వెళ్లి చదువుకోవాల్సి వస్తుంది ఇక్కడికి ఎలాంటి బస్సు సౌకర్యం లేదు కనుక పిల్లల యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వారి యొక్క సౌకర్యార్థం తిరుమలపుడి గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను ఒకటవ తరగతి నుండి ఐదో తరగతి వరకు చేయాలని బహుజన సమాజ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పామాంజి సురేష్ ఓజిలి మండలం ఎంఈఓ శైలజ ని కలసి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో తిరుమల పూడి గ్రామస్తులు పామాంజి ప్రసన్నకుమార్ , పామాంజిరవి, అఖిలేష్,అనిల్, భరత్ ,గొట్టేపూడి వి వినేష్ తదితరులు పాల్గొన్నారు.