జెడ్పీపీబాలికఉన్నత పాఠశాల అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం

June 21, 2026 | ఆంధ్రప్రదేశ్

పయనించే జూన్ 21 ముమ్మిడివరం (ప్రతినిధి గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లా ముమ్మిడివరం జెడ్పీపీ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవం–2026 కార్యక్రమంలో విద్యార్థినులు, ఉపాధ్యాయులు మరియు స్థానిక ప్రజలతోరాష్ట్ర కార్యదర్శి, బీజేపీ యువ మోర్చా ఆర్ నరేంద్ర వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారుయోగా అనేది కేవలం శారీ వ్యాయామం మాత్రమే కాదు; మన శరీరం, మనస్సు, ఆత్మల మధ్య సమతుల్యతను నెలకొల్పే భారతీయ సంస్కృతికి చెందిన అమూల్యమైన వారసత్వం. ప్రపంచానికి భారతదేశం అందించిన ఈ గొప్ప బహుమతి నేడు కోట్లాది మందికి ఆరోగ్యకరమైన జీవన విధానంగా మారింది.విద్యార్థినులు ఎంతో ఉత్సాహంగా యోగా ఆసనాలను ప్రదర్శించడం, ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకోవడం చూసి ఎంతో సంతోషంగా అనిపించింది. చిన్న వయస్సు నుంచే యోగాను అలవాటు చేసుకోవడం ద్వారా క్రమశిక్షణ, ఏకాగ్రత, మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం పెంపొందుతాయి.“యోగా ప్రతి ఇంటికి – ఆరోగ్యం ప్రతి వ్యక్తికి” అనే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో యోగా కీలక పాత్ర పోషిస్తుంది. అని వర్మ అన్నారుఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పాఠశాల యాజమాన్యానికి, ఉపాధ్యాయులకు, పాల్గొన్న విద్యార్థినులకు హృదయపూర్వక అభినందనలు. నరేంద్ర వరం తెలిపారుభారతీయ సంస్కృతికి ప్రతీక అయిన యోగాను ఆచరిద్దాం… ఆరోగ్యవంతమైన భారత నిర్మాణానికి తోడ్పడదాం! నరేంద్ర వర్మ అన్నారు

🌐 Select Language:
📰 ePaper