ఆదర్శ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ గ్రాడ్యుయేషన్ డే 2026

June 21, 2026 | ఆంధ్రప్రదేశ్

పయ నించే సూర్యుడు జూన్ 21 ముమ్మిడివరం (ప్రతినిధి గ్రంధి నానాజీ) ఆదర్శ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఈ రోజు 2022-2026 బ్యాచ్ బి ఫారం , విద్యార్థులకు వైభవంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు నిర్వహించబడ్డాయి.కళాశాల ప్రిన్సిపాల్ డా. త్రినాధ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ అవినాష్ విచ్చేసి విద్యార్థులకు డిగ్రీ సర్టిఫికెట్లు అందజేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “ఫార్మసీ విద్యార్థులు సమాజ ఆరోగ్యానికి సేవ చేసే బాధ్యతను గుర్తించి, నీతి, నిజాయితీతో పనిచేయాలి. ఆదర్శ కాలేజ్ నుండి వెళ్తున్న మీరు దేశానికి, సమాజానికి మంచి ఫార్మాసిస్టులుగా పేరు తెచ్చుకోవాలి” అని విద్యార్థులకు సూచించారు.కళాశాల చైర్మన్ కనకరాజు మాట్లాడుతూ విద్యార్థుల కృషిని అభినందిస్తూ, భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.సెక్రటరీ డాక్టర్ నాగమణి మాట్లాడుతూ ఉన్నత శిఖరాలు అధిరోహించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నత విద్యను అభ్యసించాలని తెలియజేశారు. డైరెక్టర్ సంతోష్ మాట్లాడుతూ విద్యార్థులకు సమయపాలనన్నది అత్యంత ముఖ్యమని ఎంత కష్టపడితే అంత అభివృద్ధి ఉంటుందని తెలియజేశారు.డైరెక్టర్ డాక్టర్ హారిక మాట్లాడుతూ నేటి ఆధునిక యుగంలో డిగ్రీ కాకుండా ఉన్నత విద్యను అభ్యసించాలని దానికి ఇప్పుడు తోడు ఉంటుందని తెలియజేశారు. డాక్టర్ ప్రవళిక మాట్లాడుతూ రోగికి రోగాన్ని తగ్గట్టు మందులు ఎలా ఇస్తారో అలాగే బయట ప్రపంచానికి వెళ్ళినప్పుడు సమయపాలనతో ఎదగాలని తెలియజేశారు.ఈ విద్యా సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించిన టాపర్స్‌కు, అకాడమిక్, కల్చరల్, స్పోర్ట్స్ విభాగాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు, మెడల్స్ ప్రదానం చేశారు.చివరగా విద్యార్థులు మాట్లాడుతూ ఆదర్శ మాకు అత్యుత్తమ శిక్షణ క్రమశిక్షణ ఇచ్చిందన్నే ప్రధాన కారణం నేనేనని మా యొక్క రోగత్కి సహకరించిన మా తల్లిదండ్రులతో పాటు గురువులకు పాదాభివందనాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల మేనేజ్‌మెంట్ సభ్యులు, అన్ని డిపార్ట్‌మెంట్ల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, గ్రాడ్యుయేట్స్ తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.కార్యక్రమం చివరలో ఆర్గనైజేషన్ కమిటీ కన్వీనర్ వోట్ ఆఫ్ థాంక్స్ తెలియజేశారు. జాతీయ గీతంతో కార్యక్రమం ముగిసింది.

🌐 Select Language:
📰 ePaper