ప్రభుత్వాలు మారిన మారని గ్రామపంచాయతీ కార్మికుల బతుకులు జిపి కార్మికుల జీతాలు పెంచాలి

June 22, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు D.22.06.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ ; గ్రామపంచాయతీ కార్మికులకు సామాజిక భద్రత కల్పించండి తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ (టియుసిఐ)రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ డిమాండ్ ప్రభుత్వాలు మారిన జిపి కార్మికుల బతుకులు మాత్రం మారడం లేదని, జిపి కార్మికుల జీతాలు పెంచాలని,జిపి కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలనితెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ (టియుసిఐ) రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ డిమాండ్ నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం నాడు తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ (టియుసిఐ) ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జరిగిన ధర్నా కార్యక్రమం లో రాష్ట్ర సహాయ కార్యదర్శి R, రమేష్ పాల్గోని మాట్లాడుతు: ప్రభుత్వాలు మారిన గ్రామపంచాయతీ కార్మికుల బతుకులు మారడం లేదని అన్నారు. అనేక సంవత్సరాల నుండి ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా అభద్రత భావంతో పనిచేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు పీఎఫ్ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నేడు నెలకు 9500 రూ..లు మాత్రమే జీతాలు లభిస్తున్నాయి. కనుక కార్మికులు కట్టాల్సిన ప్రోవిడెంట్ ఫండ్ వాటాను కూడా ప్రభుత్వమే భరించ్చేటట్లు ఉండాలని డిమాండ్ చేశారు .గత నెల కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ నెలకి 50 నుంచి 60 కోట్లు గ్రామపంచాయతీ జీతాలకోసం కేటాయించి ప్రతినెల ఒకటవ తేదీ నాడు జీతాలు అందించాలని ప్రకటించినప్పటికీ నేటికీ ఒక్కరి కూడా రాలేదు.రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో రెండు నెలల వేతనాలు పెండింగ్ ఉన్నాయని, అక్కడక్కడ కొన్ని మండలాలలో, కొన్ని గ్రామాలలో నాలుగు నెలల వరకు కూడా జీతాలు పెండింగ్లో ఉన్నాయని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి ప్రకటన ప్రకారం ప్రతి నెల ఒకటవ తేదీ నాడు జీతాలు గ్రీన్ ఛానల్ ద్వారా ఇవ్వాలని ఆయన కోరారు. మున్సిపల్ కార్మికులకు జీవో 60ని అమలు చేస్తున్నారు. అదే పనులు నిర్వహిస్తున్న గ్రామపంచాయతీ వర్కర్లను 3 క్యాటగిరీలుగా విభజించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మల్టీపర్పస్ జీఓ 51 రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని, ముఖ్యమంత్రి పెంచిన జీతాలను గ్రామపంచాయతీ వర్కర్లకు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.పైడిమాండ్ల సాధన కోసం తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్, TUCI దశల వారి పోరాటాలు చేపడుతంది అని అందులో భాగంగానే నేడు (సోమవారం) కలెక్టర్ ఆఫీస్ ముందు జరిగే ధర్నా చేపట్టామన్నరు.ముఖ్యమంత్రి పెంచుతున్నానని ప్రకటించిన జీతాలు గ్రామపంచాయతీ వర్కర్లకు అమలు చేయాలి లేదా జీవో నెంబర్ 60 ప్రకారం మూడు క్యాటగిరీలుగా గ్రామపంచాయతీలకు జీతాలు పెంచాలి.ఉద్యోగ భద్రత కల్పించాలి. పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ అమలు చేయాలి.
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలి. పని భారం తగ్గించాలి.మల్టీపర్పస్ జీవో 51 నీ రద్దు చేయాలి. కారోబార్లను సహాయ కార్యదర్శులుగా నియమించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు ఇవ్వాలి. చనిపోయిన కుటుంబానికి 10 లక్షలు గ్రాటివిటీ ఇవ్వాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో DPO శ్రీనివాస్ రావు, కార్మికుల వద్దకు వచ్చి వారం రోజులో మీ సమస్య లు పరిస్కరిస్తాను అని హామీ ఇవ్వడం జరిగింది.వి, సత్తెమ్మ. రాష్ట్ర నాయకురాలు.K, రాజేశ్వర్, జిల్లా ఉపాధ్యక్షులు,G, అరవింద్, జిల్లా కోశాధికారి, మండలాల అధ్యక్ష కార్యదర్శులు, ఏ ఆశన్న, రాజన్న, విలాస్, భోజన్న, నాగరాజు, బాలకిషన్, కార్మికులు, లక్ష్మి సులోచన,రామాంజనేయులు, పోషయ్య, వంశీ. గంగాధర్, G,వర్షిత్. జగన్. తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper