శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ ఘనంగా నిర్వహించిన బీజేపీ నాయకులు

June 24, 2026 | ఆంధ్రప్రదేశ్

పయ నించే సూర్యుడు జూన్ 24 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక నాయకుడు, భారత సమగ్రత కోసం ప్రాణత్యాగం చేసిన డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా జూన్ 23న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం మండలంలో బీజేపీ మండల అధ్యక్షుడు తిక్క సత్యనారాయణ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా డొక్క సీతమ్మ అక్విడక్ట్ సమీపంలోని జెండా స్థూపం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు.అలాగే బలిదాన్ దివస్‌ను పురస్కరించుకుని ఉడిమూడి, బెల్లంపూడి, యర్రంశెట్టి వారి పాలెం, పి. గన్నవరం, ఎల్. గన్నవరం, ముంగండ, నాగుల్లంక, మొండిపులంక, నరేంద్రపురం, పోతవరం, రాజులపాలెం తదితర గ్రామాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.నాగుల్లంక గ్రామంలో ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి పితాని వెంకటేశ్వరరావు నివాసం వద్ద నిర్వహించిన బలిదాన్ దివస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా మాట్లాడుతూ, “ఒకే దేశం – ఒకే రాజ్యాంగం – ఒకే జెండా” అనే మహోన్నత నినాదంతో దేశ సమగ్రత కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు, జనసంఘ్ వ్యవస్థాపకుడు డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు. ఆయన ఆశయాలను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి చీకరమెల్లి శ్రీనివాస్, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు మేడిది సత్యనారాయణ, మాజీ జిల్లా కార్యదర్శి అడ్డాల వెంకటేశ్వరరావు, మాజీ జిల్లా వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు చిట్నీడి రంగసాయి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు తోలేటి సుబ్బారావు, మండల ఉపాధ్యక్షుడు కోల గోపాలకృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి కోటే శివాజీ, జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడు దిగుమర్తి ఏడుకొండలు, జిల్లా ఓబీసీ మోర్చా కార్యదర్శి పితాని వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకుడు కుడుపూడి సూర్యనారాయణతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper