మాజీ మంత్రి గొల్లపల్లి ని పరామర్షించిన మంత్రి సుభాష్*& గుత్తుల సాయి
పయనించే సూర్యుడు జూన్ 25 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీపుత్ర వియోగంతో బాధపడుతున్న మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరావును రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి పరామర్శించారు..గొల్లపల్లి సూర్యారావు రెండవ కుమారుడు గొల్లపల్లి ప్రసాద్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. కుమారుడి మృతితో తీవ్ర విషాదంలో ఉన్న మాజీ మంత్రి సూర్యరావును పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు మంత్రి సుభాష్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు..వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని గొల్లపల్లి ప్రసాద్ చిత్రపటానికి పుష్పాలువేసి నివాళులర్పించారు. వారితో పాటు మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకనంద, గొలుగూరి వెంకటరెడ్డి, యస్సీ కార్పోరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్, శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ కేతా శ్రీను జిల్లా తెదేపా ఉపాధ్యక్షులు తాడి నర్సింహరావు రాష్ట్ర తెదేపా హెచ్ ఆర్ డి సభ్యుడు దళిత రత్న నేదునూరి వీర్రాజు, ముమ్మిడివరం తెలుగురైతు అద్యక్షులు యాళ్ళ ఉదయ్, పెన్మత్స కృష్ణవర్మ, తెదేపా సీనియర్ నాయకులు గుబ్బల మూర్తి, అచ్చిరెడ్డి, కోట వెంకటేశ్వరరావు చిట్టూరి నాగేశ్వరరావు తదితర కూటమి నాయకులు పరామర్శలో పాల్గొన్నారు.