తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయం

నరేంద్రమోదీ సభను విజయవంతం చేద్దాం
బిజెపి సీనియర్ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
( పయనించే సూర్యుడు మే 07 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)ఈ నెల 10 వ తేదీన హైదరాబాద్ పేరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న బహిరంగ సభ కు ప్రధానమంత్రి నరేంద్రమోడీ వస్తున్న సందర్బంగా కొత్తూరు మండలం గూడూరు గ్రామంలో మండల అధ్యక్షులు అత్తాపురం మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వాల్ పేంటింగ్ పోస్టర్ విడుదల కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి బిజెపి సీనియర్ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి హాజరై వాల్ పెయింటింగ్ దేశం కోసం మోదీ మోదీ కోసం మనం చలో పేరేడ్ గ్రౌండ్ అని గోడపై రాయడం జరిగింది. విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ..రాబోయే రోజుల్లో తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయం అని అన్నారు. ఈ నెల 10 వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ పేరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే బహిరంగ సభకు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేద్దాం అని అన్నారు..