డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి

July 7, 2026 | ఆంధ్రప్రదేశ్

పయనించు సూర్యుడు జూలై 7 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ)భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి కార్యక్రమం ముమ్మిడివరం నియోజవర్గం తాళ్ళరేవు మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. జాతీయవాదం, సమగ్రతకు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తోందని తాళ్ళరేవు మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు యనమండ్ర విజయ కుమార్ తెలిపారు.స్థానిక గాంధీనగర్‌లోని దంగేంటి కృష్ణ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశ సమైక్యత కోసం శ్యామా ప్రసాద్ ముఖర్జీ చేసిన కృషిని ఈ సందర్భంగా నాయకులు గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొపనాతి దత్తాత్రేయ వర్మ, మేడిశెట్టి పవన్ కుమార్, కొలను సత్తిబాబు, టేకుమూడి రామకృష్ణ, జిల్లా సోషల్ మీడియా ఇన్‌చార్జి రొక్కాల సత్తిబాబు, విత్తనాల కరిమిల స్వామి, జొన్నలగడ్డ శ్రీనివాస్, రాములు పాల్గొని మాట్లాడారు.తాళ్ళరేవులో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న భారతీయ జనతా పార్టీ నాయకులు.

🌐 Select Language:
📰 ePaper