వైయస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి ఉత్సవాలు

July 8, 2026 | ఆంధ్రప్రదేశ్

పయ నించే సూర్యుడు జూలై 8 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో
దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ మాట్లాడుతూ, రాజశేఖర్ రెడ్డి బడుగు బలహీన వర్గాలకు, రైతులకు, రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించారని తెలిపారు. ఆయన చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. రాజశేఖర్ రెడ్డి ఎప్పటికీ ప్రజల గుండెల్లో ఉంటారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జి పొన్నాడ సతీష్ కుమార్, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, నియోజకవర్గ నాయకులు, జడ్పిటిసిలు, పార్టీ మండల అధ్యక్షులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, వివిధ అనుబంధ విభాగాల నాయకులు, మహిళా నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper