నవీన్ రెడ్డి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం..
వెంటనే వెనక్కి తీసుకోవాలి
ఫరూక్‌నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాయికల్ శ్రీనివాస్
( పయనించే సూర్యుడు జులై 09 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌పై ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనవని ఫరూక్‌నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాయికల్ శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు.ఆయన విడుదల చేసిన ప్రకటనలో మాట్లాడుతూ, ఆధారాలు లేకుండా ప్రజా ప్రతినిధులపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం బాధ్యతారాహిత్యమని అన్నారు. సిద్ధాపూర్ డంప్ యార్డ్ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం సరికాదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నారని, వారి ప్రతిష్ఠను దెబ్బతీసేలా నిరాధార వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని నవీన్ రెడ్డికి సూచించారు.ఇలాంటి అసత్య ప్రచారం, వ్యక్తిగత విమర్శలతో రాజకీయాలు చేయకుండా ప్రజా సమస్యలపై నిర్మాణాత్మకంగా స్పందించాలని రాయికల్ శ్రీనివాస్ కోరారు. లేనిపక్షంలో ప్రజలే తగిన సమయంలో తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు..