బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన ప్రతి పౌరుడి బాధ్యత: అంతర్జాతీయ కో-ఆర్డినేటర్ రంజిత్ ప్రకాశ్ పిలుపు

July 8, 2026 | సినిమా వార్తలు

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో: భైంసా (నిర్మల్ జిల్లా), జూలై 8:డ్రీమ్ స్వచ్ఛంద సంస్థ మరియు అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం భైంసా పట్టణంలోని బైపాస్ రోడ్డులో గల బృందావన్ గార్డెన్స్‌లో ప్రజా ప్రతినిధులు (పి ఆర్ ఐ ఎస్) మరియు భాగస్వామ్య పక్షాలకు “బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన” పై ఒక రోజు ఓరియంటేషన్ అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అంతర్జాతీయ కో-ఆర్డినేటర్ శ్రీ రంజిత్ ప్రకాశ్ మాట్లాడుతూ.. ప్రతి చిన్నారికి విద్య, (ఆరోగ్యం), ఆటలు మరియు సురక్షితమైన బాల్యం అనేవి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులని స్పష్టం చేశారు. సమాజంలో నేటికీ వేళ్లూనుకుపోయిన పేదరికం, నిరక్షరాస్యత మరియు కుటుంబ ఆర్థిక సమస్యల కారణంగానే కొంతమంది పిల్లలు తమ విద్యా హక్కును కోల్పోయి, చిన్న వయసులోనే ప్రమాదకరమైన పనుల్లో చేరాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాల కార్మిక వ్యవస్థ వల్ల పిల్లల శారీరక, మానసిక మరియు విద్యాపరమైన అభివృద్ధి పూర్తిగా దెబ్బతింటుందని ఆయన పేర్కొన్నారు. భావి భారత పౌరులైన పిల్లల భవిష్యత్తును కాపాడటం మరియు బాల కార్మిక వ్యవస్థను సమాజం నుండి పూర్తిగా నిర్మూలించడం కేవలం ప్రభుత్వం లేదా సంస్థల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యత అని ఆయన పిలుపునిచ్చారు.ఈ సదస్సులో పాల్గొన్న మండల విద్యాధికారి (ఎంఈఓ) సుభాష్ మరియు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ మాట్లాడుతూ, గ్రామాల్లో బాలకార్మికులు లేకుండా చూసేందుకు స్థానిక సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి వారిని మళ్లీ పాఠశాలల్లో చేర్పించేందుకు విద్యాశాఖ మరియు కార్మిక శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు.డ్రీమ్ స్వచ్ఛంద సంస్థ సీఈఓ కృష్ణ రెడ్డి మరియు డైరెక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ, తమ సంస్థ గత కొంతకాలంగా నిర్మల్ జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణ కోసం మరియు బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం నిరంతరం కృషి చేస్తోందని, ఈ సామాజిక పోరాటంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, క్షేత్రస్థాయి అధికారులు మరియు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper