వై ఎస్ ఆర్ 77వ జయంతి సందర్భంగా ఘన నివాళులు.

July 8, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడుD.8.7.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్. బాల్కొండ నియోజకవర్గంలో ఏరుగట్ల మండల కేంద్రంలోఎర్గట్ల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండలం కేంద్రం లో బుధవారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 77వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం నిర్వహించిన సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివన్నోల్ల శివకుమార్ మాట్లాడుతూ, రైతులు, పేదలు, విద్యార్థులు, మహిళల సంక్షేమం కోసం వైఎస్సార్ అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ప్రజా సంక్షేమ పాలనకు ఆయన ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు.ఆరోగ్య శ్రీ, 108లాంటి కార్యక్రమాల తో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తనదైన మార్క్ వేసుకుని ఇప్పటికి అవి కొనసాగుతు పేదలకు ఉచితం గా ఖరీదైనా వైద్యం అందుతుందంటే అది ఆయన ఆలోచన నే అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని వైఎస్సార్ సేవలను స్మరించుకున్నారు. ఈకార్యక్రమం లో మాజీ అధ్యక్షుడు సోమ దేవారెడ్డి,పలు గ్రామాల సర్పంచ్ లు ఉపసర్పంచులు,సొసైటీ ఛైర్మెన్ , కేఎంసీ డైరెక్టర్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు,యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper