గీతా కార్మికుని అంత్యక్రియల్లో పాల్గొని ఆర్థిక సహాయం అందజేసిన….కల్లు గీత కార్మిక సంఘం నాయకులు

July 8, 2026 | సినిమా వార్తలు

గీతా కార్మికులను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలి ఆముదాలపెల్లి మల్లేశం గౌడ్ కల్లుగీత కార్మిక సంఘం
రాష్ట్ర కమిటీ సభ్యులుహనుమకొండ జిల్లా పరకాల మండలం కామారెడ్డిపల్లి గ్రామంలో గీతా కార్మికుడు పెరుమండ్ల రాములు శుక్రవారం రోజున తాటిచెట్టు పైనుండి ప్రమాదవశాత్తు క్రిందపడి మరణించగా కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆముదాలపెల్లి మల్లేశం గౌడ్ వారి అంత్యక్రియల్లో పాల్గొని వారి కుటుంబ సభ్యులను పరమర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి ఆర్థిక సహాయం అంద చేసినారు.అనంతరం అధికారులతో చనిపోయిన సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ జరిగిన సంఘటనను స్థానికులతో అధికారులకు వివరించడం జరిగింది.ఈ అంత్యక్రియల్లోకల్లుగీత కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు బండి సదానంద గౌడ్, మార్క రఘుపతి గౌడ్, బుర్ర రాజమౌళి గౌడ్ కల్లుగీత కార్మిక సంఘం పరకాల మండల అధ్యక్షులు చిర్ర హరీష్ గౌడ్ స్థానిక సర్పంచ్ చిర్ర అనిత- రాజయ్య మాజీ సర్పంచ్ బూడిమే రాజయ్య కల్లుగీత కార్మిక సంఘం సొసైటీ అధ్యక్షులు తండ కుమారస్వామి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పెండ్యాల చంద్రమౌళి బీసీ సంక్షేమ సంఘం గ్రామ అధ్యక్షుడు కోడెల సతీష్ బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఎదునూరి లింగన్న, గోపరాజ్ లింగస్వామి రాసా రాజేష్ కల్లుగీత కార్మిక సంఘం నాయకులు చిర్ర భద్రయ్య చిర్ర సారంగపాణి రాపర్తి శ్రీధర్ దొమ్మటి రమేష్ మరియు గౌడ సంఘ నాయకులు ప్రజలు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper