తాళ్లరాంపూర్ సర్పంచ్ బెజ్జారపు పావని కుటుంబాన్ని పరామర్శించిన బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్.*

July 13, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడుD.13.7.2026 నిజామాబాద్ స్టాపర్ టీకే గంగాధర్…దైర్యం కోల్పోవద్దు అని భరోసా.బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఏర్గట్ల మండలం గ్రామం తాళ్లరాంపూర్ గ్రామ సర్పంచ్ బెజ్జారపు పావని ఇటీవల ఆకస్మికంగా మృతి చెందడంతో బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ సోమవారం రోజున వారి కుటుంబాన్ని పరామర్శించారు. పావని భర్త భాను, కుమారులు భవిత్, భవిన్ ల ను కలిసి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన ముత్యాల సునీల్ కుమార్ ఈ క్లిష్ట సమయంలో భగవంతుడు ఆ కుటుంబానికి అండగా ఉండాలని ఆకాంక్షించారు. మృతి చెందిన పావని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. చిన్నవయసులోనే తల్లిని కోల్పోయిన ఇద్దరు చిన్నారులను చూసి ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. పావని మరణం తాళ్ళరాంపూర్ గ్రామానికి తీరనిలోటని, కొద్దికాలంలోనే గ్రామ అభివృద్ధికి పాటు పడుతూ చురుకైన వ్యక్తిగా కృషి చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏర్గట్ల మండల అధ్యక్షుడు శివన్నోళ్ల శివకుమార్.ఆయా గ్రామాల సర్పంచ్ లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper